NRIs

Dr. Bhargavi Nettem, CAA President Message

May 06, 2020 09:35 PM

ప్రపంచంలో మానవాళి ఇప్పుడు ఒక విచిత్రమైన విపత్కరం లో ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసినదే. కరోనా కోవిద్-19 అనే ఈ  మహమ్మారి మన జీవితాలని అల్లకల్లోలం చేస్తోంది. ఏంతో మంది ప్రాణాలని కబళిస్తోంది. ప్రజలు భయబ్రాన్తులతో రోజులు గడుపు తున్నారు. ఈ  పరిస్తుతుల నుండి కాపాడడానికి అందరూ ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు, అందించాలని ఆరాట పడుతున్నారు. "మానవ సేవే మాధవ సేవ" ధేయ్యంగా చికాగో ఆంధ్ర అసోసియేషన్  స్వయంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అవి ప్రజలకి ఈ మహమ్మారి గురించి అవగాహనా కార్యక్రమాలు  అవ్వొచ్చు,  సంబంధిత సలహాలు అవ్వొచ్చు. ఇవి కాకుండా ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న సాటి తెలుగు వారికి సహాయం చెయ్యడం, కష్టాలలో వున్న భారతీయ విద్యార్థులను ఆదుకోవడం లాంటి సహాయ కార్యక్రమాలు  నిర్వహిస్తున్నాం. వైద్యబృందాల రక్షణ కోసం మా సంఘ ఆడపడుచులు అలుపెరగకుండా  ఎన్నో మాస్క్ లు తయారు చేసి ఇవ్వటం మాకు గర్వకారణం. స్వతహా గా డాక్టర్ అయినా నేను నా సాయ శక్తుల రోగుల సేవలు అందించడమే కాకుండా, భారత దేశం నించి చుట్టపు చూపుగా వచ్చిన తల్లితండ్రుల ఆరోగ్యం, మందుల విషయం లో సహాయం చేసే అదృష్టం కలిగించి నందుకు ఆ భగవంతునికి ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను . 


100కి పైగా కుటుంబాలతో సామూహిక సత్యనారాయణ వ్రతం ఆన్ లైన్ ద్వారా నిర్వహించి ఆ వచ్చిన విరాళాలు మొత్తం, ప్రస్తుత పరిస్థితులలో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న పూజారులకు సహాయంగా ఇవ్వ గలిగాం.  


ఇమ్మిగ్రేషన్ సమస్యలున్న వారికి attorney లతో సంప్రదింపులు, ఆర్ధిక సహాయాలు  ఏర్పాటు చేస్తున్నాం. వయో వృద్ధులకు వారి నిత్యావసర విషయాలలో మా వాలంటీర్ లు food supply నించి grocery shopping, pharmacy helpలు  చేస్తున్నారు 
మేం  మా తరుపునించి  చేసే సహాయ సహకారాలతో పాటు చికాగో లో వున్నా ఎన్నో సంస్థలతో కలిసి  వారు చేసే కార్యక్రమాలలో మా వంతు చేయూత  మేం  ఇస్తున్నాం 
ఇవన్నీ అటుంచి ఈ  క్లిష్ట పరిస్థితులలో అందరికీ  ఇంట్లోనే ఉండి  ఈ  కరోనా మహమ్మారిని గెలుద్దామని మాటి మాటికీ సందేశాలంద చేస్తూ వారి ఆహ్లాదం కోసం ఎన్నో వినూత్నమైన  ఆన్ లైన్ కార్యక్రామాలు నిర్వహిస్తున్నాం.ఇవి పిల్లలకి, పెద్దలకి, యువత కి వారి అభిరుచులకు సరిపడేట్టుగా seminars, games , competitions , music  programs , educational  programs రూపొందించడంలో మా talented board  directorలు కార్యకర్తల కృషికి నేను నా ధన్యవాదాలు తెలియచేసు కుంటున్నాను 
చివరిగా ఒక్క చికాగో నగరంలోనే కాకుండా, మా సేవాసంస్థ Andhra Pradesh Development Forum of North America (APDFNA ) ద్వారా ఈ  పరిస్థితులలో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న ఆంద్ర ప్రదేశ్ లోని ఒక వికలాంగుల ఆశ్రమానికి మా వంతు సహాయం అందిస్తున్నాం. 


ఇవన్నీ చెయ్యడానికి మంచి మనసు, కార్య దీక్ష, పరోపకార కాంక్ష  వున్న చికాగో ఆంద్ర అసోసియేషన్ వ్యవస్థాపకులకి, బోర్డు Director లకి, మా సంఘ సభ్యలకి, మా శ్రేయోభిలాషులకు ఈ  మాధ్యమం ద్వారా నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను

అట్లాగే, ఈ  అవకాశం ఇచ్చినా వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను . "సర్వే జనా సుఖినోభవంతు"
Have something to say? Post your comment